Showing posts with label Snack. Show all posts
Showing posts with label Snack. Show all posts

Friday, July 3, 2015

చిల్లి పన్నీర్

చల్లగా వున్నప్పుడు ఈ చిల్లీ పన్నీర్ తింటే భలే వుంటుంది..పేరు వినగానే అబ్బో కష్టం అనిపిస్తుంది కాని చేయటం సులువే...పైగా మన వీలు బట్టి చేసే విధానం లో మార్పులు , చేర్పులు చేసుకోవచ్చు. నేను చేసే విధానం ఎలాగో చెబుతాను ... కావలసిన పదార్ధాలు లిస్టు చూసి భయపడకండి. లిస్టు పెద్దదే కాని అవన్నీ రోజు మనం వాడేవే.


కావలసిన పదార్ధాలు :
పన్నీర్ -250 గ్రాములు
మైదా  -  రెండు చెంచాలు
కార్న్ ఫ్లోర్ - రెండు చెంచాలు
సెనగ పిండి - ఒక చెమ్చా
మిరియాల పొడి చిటికెడు
కారం - ఒక చెమ్చా
ఉప్పు - సరిపడినంత
పసుపు - చిటికెడు
చిల్లి సాస్ - అర చెమ్చ
సోయా సాస్ - అర చెమ్చా
టమాటో సాస్ - ఒక చెమ్చా
కాప్సికం - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
అజినమోటో - అర చెమ్చా
నీరు - సరిపడి నంత
నూనె - వేపుకు సరిపడ్డ
తయారి విధానం :
                                ముందుగా పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఒక బౌల్ లో మైదా , కార్న్ ఫ్లోర్ , ఉప్పు , కారం, సెనగ పిండి, మిరియాల పొడి,పసుపు వేసి బాగా కలిపి ఆ తర్వాత కొంచం నీరు పోసి దోసల పిండి లా కలపాలి. 
అందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఓ పావుగంట తర్వాత పన్నీర్ ముక్కలని తీసి నూనెలో వేయించాలి. 
 ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లి, క్యాప్సికం, పచ్చ్హి మిర్చి లని ఒక మూకుడులో రెండు చెంచాల నూనె లో వేయించాలి. అవి ఎర్రగా వేగాగానే, సాసులన్నిటి ని వేసి బాగా కలపాలి .ఆ తర్వాత వేయించిన పన్నీర్ కూడా వేసి , అజినమోటో కూడా చేర్చి బాగా కలిపి స్టవ్ ఆపాలి. .ఇష్టమయితే కొత్తిమీర వేసుకోవచ్చు 
ఈ చిల్లి పన్నీర్ చాలా రుచిగా వుంటుంది.


Friday, May 29, 2015

ఆలు టిక్కి ఛోలే ఛాట్

ఆలు టిక్కి ఛోలే ఛాట్ ఉత్తర భారతంలో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్. దీనిని కొత్తిమీర-పుదీనా చట్నీ, డేట్స్ చట్నీ, కీరా రైతాతో తింటే చాలా బావుంటుంది. పిల్లలకు ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఓసారి ఈ స్నాక్ చేసి చూడండి.
ఆలు టిక్కి చేయడానికి కావల్సిన పదార్ధాలు;-
ఆలు - మూడు
బ్రెడ్ - రెండు స్లైస్ లు
కారం - అర చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - చిటికెడు
మిరియాల పొడి - రుచికి తగినంత
నూనె - చిన్న కప్పుడు

ఛోలే చేయడానకి కావల్సిన పదార్ధాలు:

నానబెట్టిన కాబూలి శెనగలు - ఒకటిన్నర కప్పు
గరం మసాలా - ఒక చెంచా
కారం - ఒక చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
ఛోలే మసాలా - ఒక చెంచా
పసుపు - తగినంత
ఉప్ప - తగినంత
ఉల్లి తరుము - ఒక కప్పుడు
టమాటా ముక్కలు - ఒక కప్పుడు
టిక్కి తయారీ విధానం:
       ఒక కప్పులో ఉడికించి చెక్కుతీసిన ఆలూ, బ్రెడ్, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి మెత్తగా కలపాలి.

 ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి రెండు చేతుల మధ్య పెట్టి నెమ్మదిగా వత్తితే టిక్కిలా వస్తుంది (ఆలు మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా నూనె రాసుకోవాలి చేతులకి)

ఇలా చేసిన టిక్కిలను పెనం మీద నూనె వేసి ఎర్రగా కాల్చాలి.
ఛోలే తయారీ విధానం:
నానబెట్టిన శెనగలని ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
 ఇప్పుడు బాణిలో నూనె వేసి ఉల్లిపాయలని ఎర్రగా వేయించాలి.
ఆ తరువాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, చోలే మసాలా, ధనియాలపొడి వేసి బాగా కలిపి తగినంత ఉప్పుచేర్చి మగ్గనివ్వాలి.
ఆ తర్వాత ఉడికించిన శెనగలను కూడా చేర్చి కలిపి ఓ పావుగంట సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ఛోలే సిద్దమవుతుంది.
వడ్డించే విధానం:

ముందుగా ప్లేటులో ఆలు టిక్కిని పెట్టి పైన ఛోలే వేయాలి. పైన కొత్తిమీర-పుదీన చట్నీ, స్వీట్ చట్నీ వేసి ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తే ఆలు టిక్కి ఛోలే ఛాట్ రెడీ. టిక్కితో పాటు ఛోలే తింటే చాలా రుచిగా ఉంటుంది.

Friday, April 24, 2015

సింపుల్ శాండ్ విచ్

పిల్లలూ మీ బడులకు వేసవి శలవులు ఇచ్చేసారు కదా!  బాగా ఆడుకుంటున్నారు కదా!   ఆడుకొని ఆడుకొని అలసిపోయి వచ్చాక.  మీకేమన్నా తినాలి అనిపిస్తోంది కదా.  అలాంటప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టకుండా మీ చిట్టి చిట్టి చేతులుతోనే మీకు నచ్చే స్నాక్ మీరే సులువుగా తయారు చేసుకోండి.  మరి ఎలా చేసుకోవాలి ఏమి చేసుకోవాలి అని అనుకుంటున్నారా నేను చెప్తా కదా.  మీకు చాలా ఇష్టమైన శాండ్విచ్చ్ తయారు చేసుకొండి ఇలా.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ స్లైడ్స్ - 4
ఉడకబెట్టి మెత్తగా చేసిన అల్లూ - 4 చెంచాలు
గ్రీన్ చెట్ని - 4 చెంచాలు
వెన్న - 2 చెంచాలు 
ఉల్లిపాయ - 1 కట్ చేసినవి 
టమాటా - 1 కట్ చేసినవి
చాట్ మసాలా - చిటికెడు 
ఉప్పు  - చిటికెడు  
ముందుగా బ్రెడ్ స్లైడ్ తీసుకొని దానికి ఒక చెంచా సాయంతో  వెన్న పూయాలి .  ఆ తరువాత గ్రీన్ చెట్నీ కూడా పూయాలి.
ఆలూ లో చాట్ మసాలా మరియు ఉప్పు కలిపి. బ్రెడ్ స్లైడ్ మీద పరవాలి.  
ఉల్లిపాయ ముక్కలు కూడా  వెయ్యాలి.  కావాలనుకుంటే టమాటా ముక్కలు కూడా వేసుకోండి.  
బ్రెడ్ స్లైడ్ ను దానిమీద పెట్టి కొంచెం నొక్కి.  చక్కగా కట్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. 
అంతే సింపుల్ శాండ్ విచ్  తినటానికి రడీ అయ్యింది.  
హాయిగా తినేసి ఎంజాయ్ చెయ్యండి మరి.