Showing posts with label Tamarind. Show all posts
Showing posts with label Tamarind. Show all posts

Friday, January 29, 2016

చింతపండు పులిహోర

కావలసిన పదార్థాలు:--

పొడిపొడిగా వండిన అన్నం -1 కప్పు
చింతపండు గుజ్జు -పావు కప్పు
పచ్చిమిర్చి -6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -3
పోపుదినుసులు - తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు)
కరివేపాకు రెబ్బలు -కొద్దిగా
పసుపు,ఉప్పు -రుచికి తగినంత 
ఇంగువ -1/2 స్పూన్
నూనె -1/4 కప్పు 
వేరుశెనగ పప్పు -పావుకప్పు            

తయారీవిధానం:--

1.ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి.
2.ఇప్పుడు మల్లి బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలినపోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని, చింతపండుతో కలిసిన పోపుని వేసి బాగా కలియబెట్టాలి.
3.అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి. 
4.అంతే కమ్మని వాసనగల చింతపండు పులిహోర రెడీ. పండుగనాడు ప్రతీఒక్క ఇంట్లోను చేసుకొనే ప్రసాదములలో ఇది ముందుగా ఉంటుంది. ఎందుకంటే పర్వదినాలలో పసుపుఅన్నం తప్పనిసరిగా చెయ్యాలని ..... అందరూ చేస్తారు 
                                    

Saturday, April 18, 2015

మునక్కాయ ఆవకాయ



కావలసిన పదార్ధాలు :
మునక్కాడలు  – 10 మద్యస్థంగా వున్నవి .
కారంపొడి  – 1 కప్ 
ఉప్పు – ¾ కప్ 
చింతపండు పేస్ట్  – 1½ కప్ 
మెంతులు  – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు  – 5 టేబుల్ స్పూన్లు 
జీలకర్ర  – 1 టేబుల్ స్పూన్ 
పసుపు  – ¼ టేబుల్ స్పూన్ 
నూనె  – 3 కప్ 
ఇంగువ – 1/6 టేబుల్ స్పూన్ 
మునక్కాయ ఆవకాయ తయారి విధానము:
ముందుగా మునక్కాడలును శుబ్రంగా కడిగిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి,
ఒక బాండిలో నూనె వేసి అందులో చాలా కొంచెం మెంతులు వేసి కొంచెం వేగాకా, అప్పుడు మునక్కాడముక్కలు కూడా వేసి వేయించాలి.   
  ఇలా రంగు మారే వరకు వేయించాలి (పచ్చి వాసన పోవాలి ).  మెంతులు, ఆవాలు,  జీలకర్ర  నూనె లేకుండా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.  
ఒక గిన్నెలో చింతపండు పేస్ట్, మనం తాయారు చేసుకున్న పొడిని, కారంపొడి, ఉప్పు, వేయించుకుని వుంచిన మునక్కాడ ముక్కలు కలుపుకొని వుంచి తరువాత కొంచెం నూనెలో ఇంగువ వేయించి. మిశ్రంమము లో కలపాలి అంతే మునక్కాయ ఆవకాయ తయార్.  ఒకరోజు తరువాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.   మీరూ కూడా ప్రయత్నించి చూడండి.