Saturday, March 26, 2016

డబల్ కా మీఠా

అందరికి తెలుసు ఇది. ఈ మధ్య పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో సాధారణమయిపొయింది. హోటెల్స్ లో ఐతే రెండు స్లైసులు కనీసం వంద రూపాయలు పలుకుతోంది. ఇంట్లో కమ్మగా చేసుకోవచ్చు. చాల తక్కువధరకే ఇంటిల్లపాదీ తినొచ్చ్హు. మొత్తం పావు గంట పడుతుంది అంతే! ఎలా చెయాలో చూద్దామా..
కావల్సినవి:
బ్రెడ్ స్లైసులు 6
పంచదార రెండు స్పూన్లు
నెయ్యి మూడు స్పూన్లు
పాలు అర లీటరు
కండెన్సెడ్ పాలు ఒక కప్పు
నేతిలో వెయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా,సార పప్పు స్పూను చొప్పున

పాకానికి:
పంచదార అర కప్పు
నీరు అర కప్పు
ఇలాచి ఒకటి దంచింది
విధానం:
ముందు లేత పంచదార పాకం పట్టండి. అర కప్పు పంచదారని అర కప్పు నీటిలో కరిగించి దంచిన ఇలాచీ వేసి లేత పాకం వచ్చె వరకు వుంచి చల్లారనివ్వండి
అర లీటరు పాలు పావు లీటరు అయ్యే వరకు పొయ్యి మీద బెట్టి తిప్పుతూ కలబెట్టండి. అందులో కండెన్సెడ్ పాలు, రెండు స్పూన్ల పంచదారా పోసి బాగ కలిపి ఐదు నిముషాలు మరగబెట్టండి. ఆనక చల్లారనివ్వండి.
బ్రెడ్ అంచులు కోసి ముక్కోణంగా కత్తిరించండి. ఒక పెనం పై నెయ్యి వేసుకుంటూ వాతిని బంగారు రంగు వచ్చె వరకు రెందు వైపులా కాల్చి తీసి పక్కన పెట్టుకోండి.

ఈ వేయించిన బ్రెడ్ ముక్కలని పంచదార పాకంలో ముంచి తీయండి. అల అన్నిటిని ముంచి ఒక బౌల్ లో సర్దండి. వాటిపై పాల మిశ్రమాన్ని పోయండి. నేతిలో వెయించిన డ్రై ఫ్రూట్స్ తొ అలంకరించి అరగంట అయ్యాక వడ్డించండి. చల్లగా వుంటే ఇంక బాగుంటుంది.