Friday, May 29, 2015

ఆలు టిక్కి ఛోలే ఛాట్

ఆలు టిక్కి ఛోలే ఛాట్ ఉత్తర భారతంలో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్. దీనిని కొత్తిమీర-పుదీనా చట్నీ, డేట్స్ చట్నీ, కీరా రైతాతో తింటే చాలా బావుంటుంది. పిల్లలకు ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఓసారి ఈ స్నాక్ చేసి చూడండి.
ఆలు టిక్కి చేయడానికి కావల్సిన పదార్ధాలు;-
ఆలు - మూడు
బ్రెడ్ - రెండు స్లైస్ లు
కారం - అర చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - చిటికెడు
మిరియాల పొడి - రుచికి తగినంత
నూనె - చిన్న కప్పుడు

ఛోలే చేయడానకి కావల్సిన పదార్ధాలు:

నానబెట్టిన కాబూలి శెనగలు - ఒకటిన్నర కప్పు
గరం మసాలా - ఒక చెంచా
కారం - ఒక చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
ఛోలే మసాలా - ఒక చెంచా
పసుపు - తగినంత
ఉప్ప - తగినంత
ఉల్లి తరుము - ఒక కప్పుడు
టమాటా ముక్కలు - ఒక కప్పుడు
టిక్కి తయారీ విధానం:
       ఒక కప్పులో ఉడికించి చెక్కుతీసిన ఆలూ, బ్రెడ్, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి మెత్తగా కలపాలి.

 ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి రెండు చేతుల మధ్య పెట్టి నెమ్మదిగా వత్తితే టిక్కిలా వస్తుంది (ఆలు మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా నూనె రాసుకోవాలి చేతులకి)

ఇలా చేసిన టిక్కిలను పెనం మీద నూనె వేసి ఎర్రగా కాల్చాలి.
ఛోలే తయారీ విధానం:
నానబెట్టిన శెనగలని ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
 ఇప్పుడు బాణిలో నూనె వేసి ఉల్లిపాయలని ఎర్రగా వేయించాలి.
ఆ తరువాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, చోలే మసాలా, ధనియాలపొడి వేసి బాగా కలిపి తగినంత ఉప్పుచేర్చి మగ్గనివ్వాలి.
ఆ తర్వాత ఉడికించిన శెనగలను కూడా చేర్చి కలిపి ఓ పావుగంట సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ఛోలే సిద్దమవుతుంది.
వడ్డించే విధానం:

ముందుగా ప్లేటులో ఆలు టిక్కిని పెట్టి పైన ఛోలే వేయాలి. పైన కొత్తిమీర-పుదీన చట్నీ, స్వీట్ చట్నీ వేసి ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తే ఆలు టిక్కి ఛోలే ఛాట్ రెడీ. టిక్కితో పాటు ఛోలే తింటే చాలా రుచిగా ఉంటుంది.

Thursday, May 28, 2015

గుత్తి వంకాయ కూర

కావలసిన పదార్థాలు:
గుత్తి వంకాయలు - ఆరు 
ఉల్లిపాయలు - రెండు
టమోటాలు - మూడు
చింతపండు - సరిపడా
వేరుశెనగపప్పులు - ఒక కప్పు 
పచ్చి కొబ్బరి తురుము - చిన్న కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను 
పసుపు - చిటికెడు 
ఆవాలు - ఒక స్పూను
మెంతులు - కొద్దిగా 
ఎండుమిర్చి - ఐదు  
జీలకర్ర - ఒక స్పూను 
కారం, ఉప్పు, నూనె - తగినంత 

తయారుచేసే విధానం:
                                  ముందుగా వేరుశెనగపప్పుని ఒక పాన్‌లో వేయించుకోవాలి
ఆఖరున ఎండు మిర్చిని  కూడా వేయించి దించేయాలి.
తరువాత  ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేయించుకోవాలి.
 ఇప్పుడు వేయించుకున్న అన్నిటినీ, ఉప్పు, పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి
మొత్తం కోయకూడదు. ఇప్పుడు వంకాయల మధ్యలో సిద్ధం చేసుకున్న పేస్టుని కూర్చుకుని  పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి ఐదు నిముషాల పాటు ఉంచి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలిలో తగినంత నూనె పోసి వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేయించుకోవాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి
ఇప్పుడు వంకాయలను కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. 
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి. ఇప్పుడు  చింతపండు రసం పొయ్యాలి. అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. 
అంతే గుత్తి వంకాయ కూర రెడీ









Wednesday, May 20, 2015

కలర్ ఫుల్ కాజు స్వీట్

కావలసినవి 
కాజు పేస్ట్ - 200 గ్రాములు
చక్కెర -150 గ్రాములు
బాదం పేస్ట్ - 50 గ్రాములు
డ్రైఫ్రూట్స్, జీడిపప్పు - అర కప్పు
పిస్తా - 10గ్రాములు
కిస్‌మిస్ - 10 గ్రాములు
చక్కెర - 30 గ్రాములు
గ్రీన్ కలర్ - చిటికెడు
గులాబీ రంగు ఫుడ్ కలర్- చిటికెడు

తయారి:
      ముందుగా జీడిపప్పు పేస్టులో  పంచదార కలిపి ఉడికించాలి.
మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత ఒక ట్రేలోకి తీసుకుని, ఫుడ్ కలర్,సన్నగా కట్ చేసిన  డ్రై ఫ్రూట్స్ కలిపి పక్కన ఉంచాలి.
బాదం పేస్టులో నాలుగు స్పూన్ ల పంచదార  వేసి ఉడికించుకోవాలి.
 మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత రెండు భాగాలు చేసి ఒక భాగంలో గ్రీన్ కలర్ కలపాలి. ఇప్పుడు ముందుగా ట్రేలో గ్రీన్ కలర్ కలిపిన బాదం మిశ్రమాన్ని, ఆ పైన తెల్లగా ఉన్న బాదం మిశ్రమాన్ని సర్దాలి.


ఇప్పుడు పింక్ కలర్ కాజు మిశ్రమం బాల్‌ని పెట్టి రోల్ చేసి అన్ని భాగాలను మూసినట్లు చేయాలి. 
వీటిని కట్ చేసి ముక్కలుగా సర్వ్ చేసుకోవాలి.
 ఇప్పుడు కలర్ ఫుల్ కాజు స్వీట్ రెడీ...

Saturday, May 16, 2015

బీట్‌రూట్ బిర్యానీ

కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ - రెండు
బియ్యం -మూడు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పుదీనా - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
పచ్చి మిరపకాయలు - ఆరు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ధనియాల పొడి - రెండు స్పూన్లు
గరం మసాలా - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు

పసుపు - చిటికెడు
మిరియాలు - కొద్దిగా
మసాలా ఆకు - నాలుగు
ఉప్పు, నూనె - తగినంత



తయారుచేసే విధానము:

ముందుగా నీళ్ళల్లో  బియ్యాన్ని అరగంట  సేపు నానబెట్టుకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని తురుముకోవాలి. ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్‌రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. వేగాక అందులో నానబెట్టిన  బియ్యాన్ని  వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో  సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు  ఉడికించుకోవాలి. అంతే బీట్‌రూట్ బిర్యానీ రెడీ.