Saturday, July 18, 2015

Rasmalai

Ingredients:-
Milk - 8 cups
Lemon Juice - 2 Tbsp
Water - 5 cups
 Sugar - 1 cup
Saffron -1 pinch
Cardamom Powder - 1/4 tsp
Pistachios & Almonds powder - 2 Tbsp

prepare steps:-
1. Boil 4 cups milk in a steel pan and boil other 4 cups milk in a non-stick pan.Once the milk in the steel pan comes to boil, slowly add lemon juice,then the milk becomes curdles (paneer), switch off the stove and strain the paneer in a cheese cloth.  Pour a little cold water over the paneer and hang the cheese cloth on the tap for 15 min to remove all of the liquid.
3. Remove the paneer from the cheese cloth and grind the panneer to smooth it out, divide the paneer into little smaller the size of a ball.
4. Take the pressure cooker with 5 cup of water, add 1 cup sugar and put the paneer smaller balls.5. Close the pressure cooker lid and cook until one whistle sounds, switch off the stove with in 5 min. Remove the cooked paneer with a spoon into a bowl and allow it to cool.
6. Meanwhile, the milk in the non-stick pan should have reduced to half. Add sugar to taste, cardamom powder and nuts,saffron. Switch off the stove and keep milk a side
7. Gently squeeze out the sugar syrup from the paneer and place the paneer into a serving dish.Pour the prepared reduced milk over the paneer and keep into the refrigerator, Garnish with additional chopped nuts. Now have your tasty Rasamalai....
                                              







            

Tuesday, July 7, 2015

మామిడికాయ తురుము పచ్చడి

                                                 
కావలసినవి:

మామిడికాయ తురుము - ఒక కప్పు
వేయించిన ఆవాలు - ఒక స్పూన్
మెంతులు - ఒక స్పూన్    
కారం - మూడు స్పూన్లు
ఇంగువ - అరా స్పూన్    
ఉప్పు-   తగినంత
పసుపు - తగినంత
నూనె - సరిపడగా
తయారీ :
ముందుగా ఆవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తరువాత దీనిలో పక్కకు తీసిపెట్టుకున్న కారం, మెంతిపొడి వేసిన నూనె వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని  వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి..

Friday, July 3, 2015

చిల్లి పన్నీర్

చల్లగా వున్నప్పుడు ఈ చిల్లీ పన్నీర్ తింటే భలే వుంటుంది..పేరు వినగానే అబ్బో కష్టం అనిపిస్తుంది కాని చేయటం సులువే...పైగా మన వీలు బట్టి చేసే విధానం లో మార్పులు , చేర్పులు చేసుకోవచ్చు. నేను చేసే విధానం ఎలాగో చెబుతాను ... కావలసిన పదార్ధాలు లిస్టు చూసి భయపడకండి. లిస్టు పెద్దదే కాని అవన్నీ రోజు మనం వాడేవే.


కావలసిన పదార్ధాలు :
పన్నీర్ -250 గ్రాములు
మైదా  -  రెండు చెంచాలు
కార్న్ ఫ్లోర్ - రెండు చెంచాలు
సెనగ పిండి - ఒక చెమ్చా
మిరియాల పొడి చిటికెడు
కారం - ఒక చెమ్చా
ఉప్పు - సరిపడినంత
పసుపు - చిటికెడు
చిల్లి సాస్ - అర చెమ్చ
సోయా సాస్ - అర చెమ్చా
టమాటో సాస్ - ఒక చెమ్చా
కాప్సికం - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
అజినమోటో - అర చెమ్చా
నీరు - సరిపడి నంత
నూనె - వేపుకు సరిపడ్డ
తయారి విధానం :
                                ముందుగా పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఒక బౌల్ లో మైదా , కార్న్ ఫ్లోర్ , ఉప్పు , కారం, సెనగ పిండి, మిరియాల పొడి,పసుపు వేసి బాగా కలిపి ఆ తర్వాత కొంచం నీరు పోసి దోసల పిండి లా కలపాలి. 
అందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఓ పావుగంట తర్వాత పన్నీర్ ముక్కలని తీసి నూనెలో వేయించాలి. 
 ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లి, క్యాప్సికం, పచ్చ్హి మిర్చి లని ఒక మూకుడులో రెండు చెంచాల నూనె లో వేయించాలి. అవి ఎర్రగా వేగాగానే, సాసులన్నిటి ని వేసి బాగా కలపాలి .ఆ తర్వాత వేయించిన పన్నీర్ కూడా వేసి , అజినమోటో కూడా చేర్చి బాగా కలిపి స్టవ్ ఆపాలి. .ఇష్టమయితే కొత్తిమీర వేసుకోవచ్చు 
ఈ చిల్లి పన్నీర్ చాలా రుచిగా వుంటుంది.


Pan Pizza

Hi kids after so long time.I think all of u people like to eat pizza.For pizza u guys no need to go to out side and make at home only ask ur mother to cook pizza.do u know recipe of pizza if dont know just see.
Ingredients;
All purpose flour - 1 Cup
Caster sugar – 2 Tbsp
Yeast - 5 Gr
Salt -To Taste
Oil - 1 Tbsp
Garlic(chopped) - 1 Tbsp
Onions(chopped) -1/2 Cup
Red chilly powder - 1 Tbsp
Red chilly sauce -1 Tbsp
Tomato ketchup - 1 Tbsp
Tomato puree - 1/2 Cup
Concasse of tomatoes - 1 Cup
Vinegar - 1 tbsp
Black pepper - 1 Tbsp
Mixed herbs - 1/2 Tbsp
Basil - 1/2 Tbsp
Sugar - 1 Tbsp
Onions - 1/2 Cup
Capsicum - 1/2 Cup
Tomato - 1/2 Cup
Pizza cheese - 1/2 Cup
Prepare Steps: 
.Take a bowl and add all purpose flour, caster sugar, yeast, salt mix it.
 To it add little water, oil and mix to make a soft dough and keep aside.

 Heat oil in a pan and add garlic, onions, red chilly powder, red chilly sauce, tomato ketchup, tomato puree, concasse of tomatoes, vinegar, coarse black pepper powder, mixed herbs, basil, sugar, little salt and mix it later cook it, keep aside

 Divide dough into small parts and roll it, later place on back of plate and press it with hand
 Do docking with fork and keep aside.
 Heat pan and add onions, capsicum and saute it on high flame.

Add pizza seasoning, tomato and saute it. Pinch pizza at edges and place it on hot microwave oven
Flip the pizza and spread sauce, sauted vegetable, place pizza cheese in center
Place on same hot pan later&cover it with another tawa on its top and cook for 5 mins.Transfer into chopping board and cut with pizza cutter. Now pan pizza is ready to serve.






Tuesday, June 2, 2015

వేసవిలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే?

సాధరణంగా వేసవి వచ్చిందంటే చాలు మన శరీరంలో ఉడక మొదలవుతుంది. అంతేకాక మన శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. తక్కువ పని చేసినా ఎక్కువ శక్తి కోల్పొతాం.. తత్ఫలితంగా శక్తి హీనతా జరిగి చివరికి అలసటకి గురి అవ్వటమేకాక అసహనానికి కూడా లోను అవుతాం. ప్రయాణాల్లో సైతం ఎంతో శరీరం నిర్జలీకరమైపోతుంది. వేసవికాలంలో సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. దీనివల్ల మన శరీరంలో శక్తి అయిపోతుంది. కానీ మీరు వేసవిలో ఉడక నుంచీ బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా..

నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను తినాలి

వేసవిలో ఉడక నుంచీ మీరు సమ్రక్షింపబడాలంటే మీరు తప్పకుండా నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్భూజ, బొప్పయిలను ఎక్కువగా తప్పకుండా తినాలి.

సోడాను వాడాలి

మెరిసేనీటిని తీసుకుని దానికి కొంత ఒక టీస్పూన్ సోడాను కలిపి తాగాలి. అయితే ఐస్క్రీం పార్లర్ లో దొర్కికే సోడానైనా ఉపయోగించవచ్చు.. అయితే ఈ పానియాన్ని ఎక్కువసార్లు ఉపయోగించటం మంచిది కాదు. సోడాను ఎక్కువగా ఉపయోగించటం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడే అవకాశముంది.

వ్యాయామం

పొద్దున్నే బాగా నీరుని తీసుకుని తర్వాత వ్యాయామం చేస్తే మీరు ఎంతో ఫ్రెష్ గా ఉంటారు. ఆక్షిజన్ ఎక్కువగా అంది మీరు ఎంతో శక్తి మీరు కలిగి ఉంటారు.

ప్రయాణానినికి ముండు

ప్రయాణానికి బయల్దేరే ముందు బాగా నీటిని తీసుకుంటే మంచిది.

తడిగా ఉన్న నాప్కిన్స్ వెంట తీసుకువెళ్ళాలి

తేమను కలిగి ఉన్న నాప్కిన్స్ ను వెంట తీసుకు వెళ్ళలి. మెడికల్ స్టోర్స్ లొ రెటైల్ అవుట్లెట్స్ లో దొరికే తేమగల నాప్కిన్స్ ను వెంట ఉంచ్చుకుని ఎప్పుడు మీరు ఉక్కపోతగా ఫీల్ అయితే అప్పుడు వాటితో తుడుచుకుంటే ఎంతో మంచిది.

భోజనానికి ముందు నీటిని తీసుకోవాలి

భోజనానికి ఉపక్రమించే ముందు తగినంత నీటిని తీసుకోవాలి. ఇందువల్ల శరీరంలో ఓవర్ హేట్ లేకుండా చేస్తుంది. అంతేకాక భోజనానికి ముందు నీటిని తీసుకోవటం వల్ల తగినంతే ఆహారం తీసుకుంటారు. భోజం ముందు నీటిని తాగటం వల్ల మీకు తరచుగా దాహానికి గురి అవ్వరు. ఒకవేళ భోజనం తర్వాత నీటిని తీసుకునేట్లయితే భొజనానికి నీరు తాగటానికి కనీసం ఒక గంట అయినా సమయాన్ని తీసుకోవాలి.

వాటర్ బాటిల్ ను వెంట తీసుకువెల్లటం

మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ను వెంట తీసుకు వెల్లాలి. అదీ ప్రయాణాలలో వాటర్ బాటిల్ ను ఉంచుకోవటం ఎంతో మంచిది. తరచుగా నీటిని తీసుకోవటం వల్ల శరీరం లోని ఉష్ణోగ్రతలు చక్కగా నడుస్తాయి.

బగా నీటిని తీసుకోవాలి

మీరు బాగా నీటిని తీసుకోవాలి. తరచుగా నీటిని తీసుకోవతం వల్ల శరీర ఉష్నోగ్రతలు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. అంతేకాక మీకు అంతగా నీటిని పదే పదే తీసుకోలేకపోతే అప్పుడు ఫ్లావర్ను నీటితో కలిపి తీసుకోవాలి. వనీల, మాంగో, ఆరంజ్ లాంటి ఫ్లావర్స్ కలిపి వాడితే వాటి వల్లు మీకు దప్పిక ఎక్కువై తరచుగా నీటిని తీసుకునే అవకాశం ఉంది.

ఆల్టర్నాటివెస్ ను వాడటం

మీరు ఎక్కవగా స్పోర్ట్స్ డ్రింక్స్ అవే సైటోమక్స్ లాంటివి వాడతం వల్ల కూడా దెహైడ్రాషన్ నుంచీ బయటపడతారు. ఎందుకంటే మన శరీరంలోని సోడియం, పొటాషియం ను సూర్య కిరణాల తాకిడికి చనిపోతాయి. అంచేత సోడియం, పొటాషియం ఎక్కువగా ఉన్న డ్రింక్స్, పదార్ధలను వాడటం మంచిది.

పొద్దునే మేల్కోవటం

మీరు వేకువజామునే మేల్కోవటం వల్ల అదేవిధంగా పొద్దునే 6 గంటల సమయంలో నడక అంతేకాక జాగింగ్ చేయటం వల్ల శరీరంలో ఆక్షిజన్ సమకూరి ప్లెసంట్ అట్మాస్ఫియర్ ని పొందటమే కాక మీ శరీరం తేమను కలిగి ఉండి ఎక్కువ గంటలు ఫ్రెష్ గా ఉంటారు.

Friday, May 29, 2015

ఆలు టిక్కి ఛోలే ఛాట్

ఆలు టిక్కి ఛోలే ఛాట్ ఉత్తర భారతంలో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్. దీనిని కొత్తిమీర-పుదీనా చట్నీ, డేట్స్ చట్నీ, కీరా రైతాతో తింటే చాలా బావుంటుంది. పిల్లలకు ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఓసారి ఈ స్నాక్ చేసి చూడండి.
ఆలు టిక్కి చేయడానికి కావల్సిన పదార్ధాలు;-
ఆలు - మూడు
బ్రెడ్ - రెండు స్లైస్ లు
కారం - అర చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - చిటికెడు
మిరియాల పొడి - రుచికి తగినంత
నూనె - చిన్న కప్పుడు

ఛోలే చేయడానకి కావల్సిన పదార్ధాలు:

నానబెట్టిన కాబూలి శెనగలు - ఒకటిన్నర కప్పు
గరం మసాలా - ఒక చెంచా
కారం - ఒక చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
ఛోలే మసాలా - ఒక చెంచా
పసుపు - తగినంత
ఉప్ప - తగినంత
ఉల్లి తరుము - ఒక కప్పుడు
టమాటా ముక్కలు - ఒక కప్పుడు
టిక్కి తయారీ విధానం:
       ఒక కప్పులో ఉడికించి చెక్కుతీసిన ఆలూ, బ్రెడ్, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి మెత్తగా కలపాలి.

 ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి రెండు చేతుల మధ్య పెట్టి నెమ్మదిగా వత్తితే టిక్కిలా వస్తుంది (ఆలు మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా నూనె రాసుకోవాలి చేతులకి)

ఇలా చేసిన టిక్కిలను పెనం మీద నూనె వేసి ఎర్రగా కాల్చాలి.
ఛోలే తయారీ విధానం:
నానబెట్టిన శెనగలని ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
 ఇప్పుడు బాణిలో నూనె వేసి ఉల్లిపాయలని ఎర్రగా వేయించాలి.
ఆ తరువాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, చోలే మసాలా, ధనియాలపొడి వేసి బాగా కలిపి తగినంత ఉప్పుచేర్చి మగ్గనివ్వాలి.
ఆ తర్వాత ఉడికించిన శెనగలను కూడా చేర్చి కలిపి ఓ పావుగంట సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ఛోలే సిద్దమవుతుంది.
వడ్డించే విధానం:

ముందుగా ప్లేటులో ఆలు టిక్కిని పెట్టి పైన ఛోలే వేయాలి. పైన కొత్తిమీర-పుదీన చట్నీ, స్వీట్ చట్నీ వేసి ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తే ఆలు టిక్కి ఛోలే ఛాట్ రెడీ. టిక్కితో పాటు ఛోలే తింటే చాలా రుచిగా ఉంటుంది.

Thursday, May 28, 2015

గుత్తి వంకాయ కూర

కావలసిన పదార్థాలు:
గుత్తి వంకాయలు - ఆరు 
ఉల్లిపాయలు - రెండు
టమోటాలు - మూడు
చింతపండు - సరిపడా
వేరుశెనగపప్పులు - ఒక కప్పు 
పచ్చి కొబ్బరి తురుము - చిన్న కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను 
పసుపు - చిటికెడు 
ఆవాలు - ఒక స్పూను
మెంతులు - కొద్దిగా 
ఎండుమిర్చి - ఐదు  
జీలకర్ర - ఒక స్పూను 
కారం, ఉప్పు, నూనె - తగినంత 

తయారుచేసే విధానం:
                                  ముందుగా వేరుశెనగపప్పుని ఒక పాన్‌లో వేయించుకోవాలి
ఆఖరున ఎండు మిర్చిని  కూడా వేయించి దించేయాలి.
తరువాత  ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేయించుకోవాలి.
 ఇప్పుడు వేయించుకున్న అన్నిటినీ, ఉప్పు, పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి
మొత్తం కోయకూడదు. ఇప్పుడు వంకాయల మధ్యలో సిద్ధం చేసుకున్న పేస్టుని కూర్చుకుని  పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి ఐదు నిముషాల పాటు ఉంచి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలిలో తగినంత నూనె పోసి వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేయించుకోవాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి
ఇప్పుడు వంకాయలను కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. 
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి. ఇప్పుడు  చింతపండు రసం పొయ్యాలి. అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. 
అంతే గుత్తి వంకాయ కూర రెడీ









Wednesday, May 20, 2015

కలర్ ఫుల్ కాజు స్వీట్

కావలసినవి 
కాజు పేస్ట్ - 200 గ్రాములు
చక్కెర -150 గ్రాములు
బాదం పేస్ట్ - 50 గ్రాములు
డ్రైఫ్రూట్స్, జీడిపప్పు - అర కప్పు
పిస్తా - 10గ్రాములు
కిస్‌మిస్ - 10 గ్రాములు
చక్కెర - 30 గ్రాములు
గ్రీన్ కలర్ - చిటికెడు
గులాబీ రంగు ఫుడ్ కలర్- చిటికెడు

తయారి:
      ముందుగా జీడిపప్పు పేస్టులో  పంచదార కలిపి ఉడికించాలి.
మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత ఒక ట్రేలోకి తీసుకుని, ఫుడ్ కలర్,సన్నగా కట్ చేసిన  డ్రై ఫ్రూట్స్ కలిపి పక్కన ఉంచాలి.
బాదం పేస్టులో నాలుగు స్పూన్ ల పంచదార  వేసి ఉడికించుకోవాలి.
 మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత రెండు భాగాలు చేసి ఒక భాగంలో గ్రీన్ కలర్ కలపాలి. ఇప్పుడు ముందుగా ట్రేలో గ్రీన్ కలర్ కలిపిన బాదం మిశ్రమాన్ని, ఆ పైన తెల్లగా ఉన్న బాదం మిశ్రమాన్ని సర్దాలి.


ఇప్పుడు పింక్ కలర్ కాజు మిశ్రమం బాల్‌ని పెట్టి రోల్ చేసి అన్ని భాగాలను మూసినట్లు చేయాలి. 
వీటిని కట్ చేసి ముక్కలుగా సర్వ్ చేసుకోవాలి.
 ఇప్పుడు కలర్ ఫుల్ కాజు స్వీట్ రెడీ...

Saturday, May 16, 2015

బీట్‌రూట్ బిర్యానీ

కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ - రెండు
బియ్యం -మూడు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పుదీనా - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
పచ్చి మిరపకాయలు - ఆరు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ధనియాల పొడి - రెండు స్పూన్లు
గరం మసాలా - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు

పసుపు - చిటికెడు
మిరియాలు - కొద్దిగా
మసాలా ఆకు - నాలుగు
ఉప్పు, నూనె - తగినంత



తయారుచేసే విధానము:

ముందుగా నీళ్ళల్లో  బియ్యాన్ని అరగంట  సేపు నానబెట్టుకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని తురుముకోవాలి. ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్‌రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. వేగాక అందులో నానబెట్టిన  బియ్యాన్ని  వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో  సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు  ఉడికించుకోవాలి. అంతే బీట్‌రూట్ బిర్యానీ రెడీ.

Monday, April 27, 2015

టమాటో టీ

టమాటో టీ కి కావలిసిన పదార్ధము :-


టమాటోలు   4
బీట్రూట్  2 పెద్ద ముక్కలు 
వెలుల్లి 3 రేకలు 
తులసి ఆకులు  2
పుదినా ఆకులు  2
జీలకర్ర 1/4 స్పూన్ 
తగినంత ఉప్పు 
తాయారి విదానం :-
ముoదుగా మనం టమాటోలు ,బీట్రూట్ లు ముక్కలు గా కట్ చేసుకొని , వెల్లుల్లి రేకలు వేసి  డ్రై గా  అయ్యేటట్టు  వేయిచుకోవాలి.  ఓవెన్లో అయినా సరే  రోస్ట్ చేసుకోవచ్చు.   
తరువాత మనం మనకు ఎన్ని కప్పులు టీ  కావాలో అన్ని నీళ్ళు తులసి మరియు పుదినా ఆకులను , జీలకర్ర , ఉప్పు వేసి  ఉడికించుకోవాలి.  అందులో మనం ముందుగా రోస్ట్ చేసివుంచుకున్న  
 టమాటో,బీట్రూట్,వెల్లులి ని వేసి కాసేపు ఉడికించుకోవాలి.  స్పూన్ తో కలపకూడదు.  అలా వుడికిన నీటిని టీ  ఫిల్టర్ తో వడగట్టాలి.  ఇలా వడగట్టిన టీ ని కప్ లో పోసుకొని ఇష్టమైతే కొన్ని వెల్లుల్లి రేకలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పుదినా ఆకువేసుకొని అలంకరించుకొని వేడివేడి గా తాగవచ్చు.  ఈ టీని ముందుగానే చాలా ఎక్కువ తయారు చేసుకొని ఫ్రిజ్ పెట్టుకొని కావలసినప్పుడు  వేదిచేసుకొని త్రాగవచ్చు.  గ్రీన్ టీ  కంటే, సూప్ కంటే చాలా రుచిగా వుంటుంది. మీరు కూడా తయారు చేసి తాగి చూడండి.  రెసిపీ ఎలా వుందో కామెంట్ ద్వారా తెలపండి మరి.
ఈ టీ  ఆరోగ్యానికి చాలా మంచిది.  ఈ టీ లో ఒమేగా -3 ఫేటీ ఆసిడ్స్ వుంటాయి.  antioxidants కూడా వుంటాయి.  చర్మానికి మంచిది.  రక్తపోటు కలవారికి, మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది.  అజీర్ణము కలవారికి కూడా చాలా మంచిగా ఫలితాన్ని చూపిస్తుంది. జలుబు ఫ్లూ ఉన్నవారికి మంచి ఉపసమనం గా వుంటుంది.  సైనస్  వ్యాధి కలవారికి తగ్గే తట్టు చేస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి  చాలా మంచిది. 

Friday, April 24, 2015

సింపుల్ శాండ్ విచ్

పిల్లలూ మీ బడులకు వేసవి శలవులు ఇచ్చేసారు కదా!  బాగా ఆడుకుంటున్నారు కదా!   ఆడుకొని ఆడుకొని అలసిపోయి వచ్చాక.  మీకేమన్నా తినాలి అనిపిస్తోంది కదా.  అలాంటప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టకుండా మీ చిట్టి చిట్టి చేతులుతోనే మీకు నచ్చే స్నాక్ మీరే సులువుగా తయారు చేసుకోండి.  మరి ఎలా చేసుకోవాలి ఏమి చేసుకోవాలి అని అనుకుంటున్నారా నేను చెప్తా కదా.  మీకు చాలా ఇష్టమైన శాండ్విచ్చ్ తయారు చేసుకొండి ఇలా.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ స్లైడ్స్ - 4
ఉడకబెట్టి మెత్తగా చేసిన అల్లూ - 4 చెంచాలు
గ్రీన్ చెట్ని - 4 చెంచాలు
వెన్న - 2 చెంచాలు 
ఉల్లిపాయ - 1 కట్ చేసినవి 
టమాటా - 1 కట్ చేసినవి
చాట్ మసాలా - చిటికెడు 
ఉప్పు  - చిటికెడు  
ముందుగా బ్రెడ్ స్లైడ్ తీసుకొని దానికి ఒక చెంచా సాయంతో  వెన్న పూయాలి .  ఆ తరువాత గ్రీన్ చెట్నీ కూడా పూయాలి.
ఆలూ లో చాట్ మసాలా మరియు ఉప్పు కలిపి. బ్రెడ్ స్లైడ్ మీద పరవాలి.  
ఉల్లిపాయ ముక్కలు కూడా  వెయ్యాలి.  కావాలనుకుంటే టమాటా ముక్కలు కూడా వేసుకోండి.  
బ్రెడ్ స్లైడ్ ను దానిమీద పెట్టి కొంచెం నొక్కి.  చక్కగా కట్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. 
అంతే సింపుల్ శాండ్ విచ్  తినటానికి రడీ అయ్యింది.  
హాయిగా తినేసి ఎంజాయ్ చెయ్యండి మరి.