Wednesday, October 25, 2017

ఉసిరి ఆవకాయ

మొదట ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరానివ్వాలి.  ఒక బాండి తీసుకుని అందులో నూనె వేసుకొని  కొంచెం మెంతులు ఇంగువ వేసిన తరువాత ఆరబెట్టుకొని వుంచుకున్న ఉసిరికాయలు వేసి వేయించాలి.  బాగా వేగాలి కొంచెం బ్రౌన్ కల్లర్ వచ్చెవరకు వేయించితె బాగుంటుంది.  కాయని నొక్కితె ముక్కలుగా విడిపొతుంది.  అప్పుడు ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.  చల్లారిన తరువాత దానికి కావలసిన కారం, ఉప్పు, మెంతిపొడి కొంచెం ఆవాలపొడి వెసి బాగా కలిపేస్తే ఎంతో రుచికరమైన ఉసిరి ఆవకాయ రడీ....