Monday, April 27, 2015

టమాటో టీ

టమాటో టీ కి కావలిసిన పదార్ధము :-


టమాటోలు   4
బీట్రూట్  2 పెద్ద ముక్కలు 
వెలుల్లి 3 రేకలు 
తులసి ఆకులు  2
పుదినా ఆకులు  2
జీలకర్ర 1/4 స్పూన్ 
తగినంత ఉప్పు 
తాయారి విదానం :-
ముoదుగా మనం టమాటోలు ,బీట్రూట్ లు ముక్కలు గా కట్ చేసుకొని , వెల్లుల్లి రేకలు వేసి  డ్రై గా  అయ్యేటట్టు  వేయిచుకోవాలి.  ఓవెన్లో అయినా సరే  రోస్ట్ చేసుకోవచ్చు.   
తరువాత మనం మనకు ఎన్ని కప్పులు టీ  కావాలో అన్ని నీళ్ళు తులసి మరియు పుదినా ఆకులను , జీలకర్ర , ఉప్పు వేసి  ఉడికించుకోవాలి.  అందులో మనం ముందుగా రోస్ట్ చేసివుంచుకున్న  
 టమాటో,బీట్రూట్,వెల్లులి ని వేసి కాసేపు ఉడికించుకోవాలి.  స్పూన్ తో కలపకూడదు.  అలా వుడికిన నీటిని టీ  ఫిల్టర్ తో వడగట్టాలి.  ఇలా వడగట్టిన టీ ని కప్ లో పోసుకొని ఇష్టమైతే కొన్ని వెల్లుల్లి రేకలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పుదినా ఆకువేసుకొని అలంకరించుకొని వేడివేడి గా తాగవచ్చు.  ఈ టీని ముందుగానే చాలా ఎక్కువ తయారు చేసుకొని ఫ్రిజ్ పెట్టుకొని కావలసినప్పుడు  వేదిచేసుకొని త్రాగవచ్చు.  గ్రీన్ టీ  కంటే, సూప్ కంటే చాలా రుచిగా వుంటుంది. మీరు కూడా తయారు చేసి తాగి చూడండి.  రెసిపీ ఎలా వుందో కామెంట్ ద్వారా తెలపండి మరి.
ఈ టీ  ఆరోగ్యానికి చాలా మంచిది.  ఈ టీ లో ఒమేగా -3 ఫేటీ ఆసిడ్స్ వుంటాయి.  antioxidants కూడా వుంటాయి.  చర్మానికి మంచిది.  రక్తపోటు కలవారికి, మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది.  అజీర్ణము కలవారికి కూడా చాలా మంచిగా ఫలితాన్ని చూపిస్తుంది. జలుబు ఫ్లూ ఉన్నవారికి మంచి ఉపసమనం గా వుంటుంది.  సైనస్  వ్యాధి కలవారికి తగ్గే తట్టు చేస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి  చాలా మంచిది. 

Friday, April 24, 2015

సింపుల్ శాండ్ విచ్

పిల్లలూ మీ బడులకు వేసవి శలవులు ఇచ్చేసారు కదా!  బాగా ఆడుకుంటున్నారు కదా!   ఆడుకొని ఆడుకొని అలసిపోయి వచ్చాక.  మీకేమన్నా తినాలి అనిపిస్తోంది కదా.  అలాంటప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టకుండా మీ చిట్టి చిట్టి చేతులుతోనే మీకు నచ్చే స్నాక్ మీరే సులువుగా తయారు చేసుకోండి.  మరి ఎలా చేసుకోవాలి ఏమి చేసుకోవాలి అని అనుకుంటున్నారా నేను చెప్తా కదా.  మీకు చాలా ఇష్టమైన శాండ్విచ్చ్ తయారు చేసుకొండి ఇలా.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ స్లైడ్స్ - 4
ఉడకబెట్టి మెత్తగా చేసిన అల్లూ - 4 చెంచాలు
గ్రీన్ చెట్ని - 4 చెంచాలు
వెన్న - 2 చెంచాలు 
ఉల్లిపాయ - 1 కట్ చేసినవి 
టమాటా - 1 కట్ చేసినవి
చాట్ మసాలా - చిటికెడు 
ఉప్పు  - చిటికెడు  
ముందుగా బ్రెడ్ స్లైడ్ తీసుకొని దానికి ఒక చెంచా సాయంతో  వెన్న పూయాలి .  ఆ తరువాత గ్రీన్ చెట్నీ కూడా పూయాలి.
ఆలూ లో చాట్ మసాలా మరియు ఉప్పు కలిపి. బ్రెడ్ స్లైడ్ మీద పరవాలి.  
ఉల్లిపాయ ముక్కలు కూడా  వెయ్యాలి.  కావాలనుకుంటే టమాటా ముక్కలు కూడా వేసుకోండి.  
బ్రెడ్ స్లైడ్ ను దానిమీద పెట్టి కొంచెం నొక్కి.  చక్కగా కట్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. 
అంతే సింపుల్ శాండ్ విచ్  తినటానికి రడీ అయ్యింది.  
హాయిగా తినేసి ఎంజాయ్ చెయ్యండి మరి. 

Sunday, April 19, 2015

జీలకర్రతో చిట్కా.

చిన్న పిల్లలు తరచుగా భోజనం చేయటానికి చాలా ఇబ్బంది పెట్టేస్తూ వుంటారు.  వాళ్లకి ఆకలి సరిగా లేకనే సరిగా తినరు.  అలాంటి వారికోసం ఒక మంచి చిట్కా.
ఒక చెంచాడు జీలకర్రని తీసుకొని మంచిగా కొన్ని చుక్కలు నీరు వేసి నూరుకోవాలి. ఆతరువాత ఐదు చెంచాల నీరు కలిపి వడగట్టుకొని.  ఆ నీటిని పిల్లలకు పరగడుపున రోజూ తాగిస్తే 15 రోజులలో మంచి ఫలితం కనిపిస్తుంది. 
ఈ చిట్కా పిల్లలకే కాదు పెద్దవారికి కూడా పనికి వస్తుంది.  అవసరమైతే మీరు ప్రయత్నించండి.    

Saturday, April 18, 2015

మునక్కాయ ఆవకాయ



కావలసిన పదార్ధాలు :
మునక్కాడలు  – 10 మద్యస్థంగా వున్నవి .
కారంపొడి  – 1 కప్ 
ఉప్పు – ¾ కప్ 
చింతపండు పేస్ట్  – 1½ కప్ 
మెంతులు  – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు  – 5 టేబుల్ స్పూన్లు 
జీలకర్ర  – 1 టేబుల్ స్పూన్ 
పసుపు  – ¼ టేబుల్ స్పూన్ 
నూనె  – 3 కప్ 
ఇంగువ – 1/6 టేబుల్ స్పూన్ 
మునక్కాయ ఆవకాయ తయారి విధానము:
ముందుగా మునక్కాడలును శుబ్రంగా కడిగిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి,
ఒక బాండిలో నూనె వేసి అందులో చాలా కొంచెం మెంతులు వేసి కొంచెం వేగాకా, అప్పుడు మునక్కాడముక్కలు కూడా వేసి వేయించాలి.   
  ఇలా రంగు మారే వరకు వేయించాలి (పచ్చి వాసన పోవాలి ).  మెంతులు, ఆవాలు,  జీలకర్ర  నూనె లేకుండా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.  
ఒక గిన్నెలో చింతపండు పేస్ట్, మనం తాయారు చేసుకున్న పొడిని, కారంపొడి, ఉప్పు, వేయించుకుని వుంచిన మునక్కాడ ముక్కలు కలుపుకొని వుంచి తరువాత కొంచెం నూనెలో ఇంగువ వేయించి. మిశ్రంమము లో కలపాలి అంతే మునక్కాయ ఆవకాయ తయార్.  ఒకరోజు తరువాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.   మీరూ కూడా ప్రయత్నించి చూడండి.    

Wednesday, April 15, 2015

ఐస్ క్రీమ్ కి ఈ చిట్కా

ఒక ప్లాస్టిక్ జిప్ లాక్  బ్యాగ్ లో ఐస్ క్రీమ్ ను వుంచితే ఐస్ క్రీమ్ గట్టిగా తయారవ్వకుండా వుంటుంది.  మీ స్పూన్స్ బెండ్ అవ్వకుండా వుంటుంది. అంతేకాకుండా  చల్లగా మరియు మృదువుగా ఉంచుతుంది.  ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. 

Tuesday, April 14, 2015

చక్కెర పొoగలి

చక్కెర పొoగలి :-

కావలసిన పదార్ధములు:-


  1. 1/4 kg బియ్యం 
  2.  1 చెక్క పచ్చికొబ్బరి 
  3.  100 gm నెయ్యి 
  4.  1/4 kg  పెసర పప్పు 
  5.  150 gm  జీడిపప్పు 
  6.  150 gm బాదంపప్పు 
  7.  చిటికెడు పచ్చకర్పూరం 
  8.  350 gm  పంచదార 
  9.  1 lt  పాలు 
  10.  150 gm కిస్మిస్


తయారీ విదానం :-


 ఒక బాణీ లో జీడిపప్పు,బాదంపప్పు,నెయ్యి వేసి వయిచుకోవాలి.
 మరి కొంచం నెయ్యి  వేసి పెసరపప్పు,సన్నగా  తరిగిన కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి .పెసరపప్పు,సన్నగా  తరిగిన కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి .
 బియ్యం,పెసరపప్పు ,కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా  ఉడికించుకోవాలి. 

ఈ మిశ్రమములో చక్కర వేసి మరి కొద్ది సమయం ఉడికించుకోవాలి

 వేయించుకొన్న జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు ,చిటికెడు పచ్చకర్పూరం వేసి కాసేపు ఉంచుకోవాలి. 
చాలా రుచికరమైన చక్కర పొంగలి తయారైంది  అయ్యింది.  ఇది  వేడిగా చాలా బాగుంటుంది.