Thursday, May 28, 2015

గుత్తి వంకాయ కూర

కావలసిన పదార్థాలు:
గుత్తి వంకాయలు - ఆరు 
ఉల్లిపాయలు - రెండు
టమోటాలు - మూడు
చింతపండు - సరిపడా
వేరుశెనగపప్పులు - ఒక కప్పు 
పచ్చి కొబ్బరి తురుము - చిన్న కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను 
పసుపు - చిటికెడు 
ఆవాలు - ఒక స్పూను
మెంతులు - కొద్దిగా 
ఎండుమిర్చి - ఐదు  
జీలకర్ర - ఒక స్పూను 
కారం, ఉప్పు, నూనె - తగినంత 

తయారుచేసే విధానం:
                                  ముందుగా వేరుశెనగపప్పుని ఒక పాన్‌లో వేయించుకోవాలి
ఆఖరున ఎండు మిర్చిని  కూడా వేయించి దించేయాలి.
తరువాత  ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేయించుకోవాలి.
 ఇప్పుడు వేయించుకున్న అన్నిటినీ, ఉప్పు, పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి
మొత్తం కోయకూడదు. ఇప్పుడు వంకాయల మధ్యలో సిద్ధం చేసుకున్న పేస్టుని కూర్చుకుని  పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి ఐదు నిముషాల పాటు ఉంచి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలిలో తగినంత నూనె పోసి వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని వేసి వేయించుకోవాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి
ఇప్పుడు వంకాయలను కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. 
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి. ఇప్పుడు  చింతపండు రసం పొయ్యాలి. అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. 
అంతే గుత్తి వంకాయ కూర రెడీ









No comments:

Post a Comment

ధన్యవాదములు.