Friday, November 3, 2017

ఆవ ఉసిరికాయ పచ్చడి

ఆవ ఉసిరికాయ పచ్చడి. ఉసిరి ఆవకాయెనండీ. కాకపోతే ఇది కొంచెం సింపుల్ గా చేసుకునేది . మాములుగా అయితే ఉసిరికాయల్ని ఆయిల్ లో వేయించుతాం కదా ! ఇది అలా కాదు. 

ముందుగా ఉసిరికాయాలిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆతరువాత ఆవపిండి, ఉప్పు , కారం, కొంచెం పచ్చి మెంతులు కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకుని ఉసిరి ముక్కలు కూడావేసి కలుపుకోవాలి. కొంచెం సేపు తరువాత ఊట ఊరుతోంది. అప్పుడు బాగా కలిపి. నూనెని వేడిచేసుకొని అందులో కొంచెం ఆవాలు ఇంగువ వేసి అవి వేగినతరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె చల్లారిన తరువాత ఉసిరి ఆవకాయలో కలిపితే ఆవ రెడీ. ఇది నార్మల్ చాలా బాగుంటుంది. ముక్కలు స్మూత్ గా మాత్రం ఉండవు. ముక్కలు ఊరి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని చూడండి.

No comments:

Post a Comment

ధన్యవాదములు.